సరే మనం ఇప్పుడు ఆన్లైన్ ఇన్సూరెన్స్ ఎన్నో రకరకాల ఇన్సూరెన్స్ లో ఉంటాయి. ఉదా:- హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, వాహన ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఇంకా ఎన్నో రకరకాల ఇన్సూరెన్స్ లు ఉన్నాయి. ఇప్పుడు మనం “వాహనాలకు సంబంధించిన ఆన్లైన్ ఇన్సూరెన్స్” అంటే కారు లేదా బైక్ ఇన్సూరెన్స్‌ను “ఇంటర్నెట్ ద్వారా” తీసుకోవడం, రిన్యూ చేయడం లేదా నిర్వహించడం.
ఇంకా సులభంగా చెప్పాలంటే :-
బైక్ / కారు ఇన్సూరెన్స్ కోసం ఆఫీసులు లేదా ఏజెంట్ దగ్గరకు వెళ్లకుండా, “మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా” పాలసీ తీసుకోవడమే ఆన్లైన్ వాహన ఇన్సూరెన్స్.
ఆన్లైన్ వాహన ఇన్సూరెన్స్ తీసుకోవడానికి అవసరమైన వివరాలు :-
* వాహన – రిజిస్ట్రేషన్ నంబర్
* వాహనం – మోడల్ & తయారీ సంవత్సరం
* పాత ఇన్సూరెన్స్ ఉంటే దాని వివరాలు
* మీ మొబైల్ నంబర్ / ఇమెయిల్
ప్రీమియం ఎందుకు మారుతుంది :-
ప్రీమియం మొత్తం ఈ విషయాలపై ఆధారపడుతుంది
* వాహన విలువ (IDV)
* వాహనం వయస్సు
* మీరు ఎంచుకునే కవరేజ్
* మీరు ఎంచుకునే “అడ్డాన్లు”
ఆన్లైన్ వాహన ఇన్సూరెన్స్‌లో ఏమి చేయొచ్చు :-
* వివిధ ఇన్సూరెన్స్ కంపెనీల పాలసీలను – పోల్చుకోవచ్చు
* మీ వాహనానికి సరిపడే పాలసీని – ఎంచుకోవచ్చు
* ఆన్లైన్లో ప్రీమియం చెల్లించచ్చు
* పాలసీ కాపీని – ఇమెయిల్ / డౌన్లోడ్ చేసుకోవచ్చు
* పాలసీ – రిన్యువల్ కూడా ఆన్లైన్లోనే
* ప్రమాదం జరిగితే – క్లెయిమ్ అప్లై చేయొచ్చు
వాహన ఇన్సూరెన్స్ రకాలు :-
1. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్
– చట్టపరంగా తప్పనిసరి
– ఎదుటి వ్యక్తి వాహనం లేదా గాయాలకు కవరేజ్
2. కాంప్రెహెన్సివ్ ఇన్సూరెన్స్
– మీ వాహనానికి నష్టం
– థర్డ్ పార్టీ కవరేజ్ కూడా ఉంటుంది – దొంగతనం, ప్రమాదం, వరద, అగ్ని ప్రమాదం వంటి వాటికి కవరేజ్
ఆన్‌లైన్‌గా తీసుకోవడం వల్ల లాభాలు :-
* వేగంగా పూర్తవుతుంది
* తక్కువ ఖర్చుతో ఉండే అవకాశాలు
* ఏజెంట్ అవసరం లేదు * ఎప్పుడైనా, ఎక్కడైనా తీసుకోవచ్చు
ఆన్లైన్ క్లెయిమ్ ఎలా చేస్తారు :-
1. ప్రమాదం జరిగిన వెంటనే కంపెనీకి సమాచారం
2. ఫోటోలు / వివరాలు అప్లోడ్
3. సర్వేయర్ తనిఖీ
4. క్యాష్‌లెస్ (లేదా) రీయింబర్స్మెంట్ క్లెయిమ్
ముఖ్యమైన అడ్డాన్(ADD-ON) కవరేజ్‌లు :-
* జీరో డిప్రిసియేషన్ – రిపేర్ సమయంలో డబ్బు ఎక్కువ వస్తుంది
* రోడ్‌సైడ్ అసిస్టెన్స్ – రోడ్డుపై ఆగిపోతే సహాయం
* ఎంజిన్ ప్రొటెక్షన్ – వరదలు వంటి సందర్భాల్లో ఉపయోగం
* పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ – డ్రైవర్‌కు భద్రత
ముఖ్యమైన సూచనలు :-
* “చట్టపరంగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి”
* పాలసీ గడువు ముగియకముందే రిన్యూ చేయాలి
* చౌక ప్రీమియం మాత్రమే చూడకుండా కవరేజ్ చూడాలి
Leave a Reply