Discounts and Cashbacks || డిస్కౌంట్స్ / క్యాష్ బ్యాక్స్ / కూపన్లు

ఒక వస్తువును ఆన్లైన్ లో కొనాలి అనుకున్నప్పుడు ముందుగా దాని ధర గురించి తెలుసుకుని… ఆ తరువాత దానికి వచ్చే డిస్కౌంట్ నూ తేలుసుకుని అప్పుడు ఓ నిర్ణయానికి వస్తాం. అలా నెలవారీ సరుకులూ, వస్తులూ, చెప్పులూ, హ్యాండ్ బ్యాగులూ, వంటింటి సామగ్రి, గృహోపకరణాలూ, ప్యాడ్జెట్లూ… ఇలా ఇదీ అదీ అని కాకుండా. అవసరమైన వాటిని అన్నిటినీ ఆన్లైన్ లోనే ఆర్డర్ చ్చేయడం ఇప్పుడు మామూలైపోయింది. అలా కొంటున్నప్పుడు సంస్థలు పది / పాతిక / డెబ్బై / ఎనభై శాతం వరకూ రాయితీలు ప్రకటించడమూ తెలిసిందే. ఒకవేళ ఆ ధరతో తృప్తిపడకపోతే మరో సైట్లోకి లాగిన్ అయి రెండింటినీ అంచనా వేసుకుంటాం. కానీ ఇప్పుడు కొన్ని సంస్థలు… ఆ పనిని మరింత సులువు చేస్తూ అసలుకు కొసరు అన్న చందంగా అదనపు రాయితీలనూ, ప్రత్యేక కూపన్లనూ అందిస్తున్నాయి.

వాటిలో కొన్నిటినీ కింద చూదాం రండి:

క్యాష్ కరో — CashKaro
ఏఅర్న్ కారో — EarnKaro
గ్రబ్ ఆన్ — GrabOn
ఫ్రీకా మాల్ — FreeKaaMaal
కూపన్దునియా — Coupon Dunia
గోపైసా — GoPaisa
కూపన్స్ వాలా — CouponsWala
నియర్బై — NearBuy
ఎక్స్ట్రా పే — ExtraPe

ఈ సైట్ల నుంచి షాపింగ్ చేస్తున్నప్పుడు ఒక వస్తువు ధరను ఇంకాస్త తగ్గేలా చేయడమే వీటి పని అన్నమాట.

గ్రబ్ ఆన్ లో అనే సైట్ను తీసుకుంటే… ఇందులో కూపన్లూ, రాయితీలూ ఉపయోగించుకుంటూ టికెట్లు బుక్ చేసుకోవడం, ఆహార పదార్థాలను ఆర్డరిచ్చుకోవడం, మందులు తెప్పించుకోవడం, క్యాబ్ లూ, ఫ్యాషన్లూ… ఇలా ఒకటేమిటి చాలా రకాలు గానే ఉపయోగించుకోవచ్చు.

నియర్ బై అనే సైట్ను తీసుకుంటే… ఇందులో ఎక్కడెక్కడ ఎలాంటి ఆఫర్లు ఉన్నాయీ, ప్రత్యేక కూప న్ కోడ్ లూ వంటివన్నీ తెలుసు కోవచ్చు. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా పనిచేస్తున్న నియర్ బై మంచి పేరు తెచ్చుకుంది.

క్యాష్ కరో అనే సైట్ను తీసుకుంటే… ఇందులో కూపన్ కోడ్ లతో పాటూ కొన్ని వస్తువుల్ని షాపింగ్ చేస్తున్నప్పుడు కాష్ బ్యాక్ ఆఫర్లూ అందించే వాటిల్లో క్యాష్ కరో వంటి సంస్థలు ఉన్నాయి.

ఆ విభాగాలవారీగా ఎన్ని కూపన్లు అందుబాటులో ఉన్నాయనేది తెలుస్తుంది. ఇందులో ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఓ లాప్టాప్ కొనాలనుకున్నప్పుడు దాని అసలు ధరకు వచ్చే రాయితీ వల్ల కొంత డబ్బు తగ్గితే… ఈ సంస్థ అందించే కూపన్ కోడ్ ద్వారా మరికొంత డబ్బును ఆదా చేసుకోవచ్చు. పైగా ఇది కూపన్ కోడ్ లతో పాటూ ప్రత్యేకంగా ఉండే రాయితీల గురించీ తెలియజేస్తుంది.

అంతే కాకుండా రాయితీతోపాటూ రివార్డ్ పాయింట్లను అందించే సంస్థలూ లేకపో లేదు. పైగా వీటి ద్వారా అమెజాన్, ఫ్లిప్ కార్డ్, జొమాటో, డొమినోస్, మింత్రా, మేక్ మై ట్రిప్… వంటి సైట్లలోకి నేరుగా లాగిన్ అయ్యే వీలూ ఉంటుంది. అదీ సంగతి కాబట్టి ఈసారి ఎప్పుడైనా ఆన్లైన్ లో ఓ వస్తువును కొనాలనుకున్నప్పుడు… వీటి ద్వారా ప్రయత్నించి చూడండి ఒకసారి.

Leave a Comment