ఇన్సూరెన్స్ / ఫైన్ / RC స్టేటస్ మాత్రమే “ఎలా చూడాలో” సింపుల్‌గా, స్టెప్-బై-స్టెప్‌గా చూద్దాం రండి.
1. ఇన్సూరెన్స్ స్టేటస్ చెక్ చేయడం:-
ఇన్సూరెన్స్ స్టేటస్ చెక్ చేయటం అనేది రెండు విధాలుగా చేయొచ్చండి, ఎలా అంటే “వెబ్సైట్ ద్వారా” మరియు “మొబైల్ యాప్” ద్వారా ఎట్లాగో ఏంటో క్లియర్ గా చూద్దాం రండి కింద.
వెబ్‌సైట్ ద్వారా
మొబైల్ యాప్ ద్వారా
వెబ్‌సైట్ ద్వారా:-
1. బ్రౌజర్ ఓపెన్ చేయండి
2. “parivahan.gov.in“ వెబ్‌సైట్‌కి వెళ్లండి
3. Informational Services → Know Your Vehicle Details క్లిక్ చేయండి
4. మీ “వాహనం నంబర్” ఎంటర్ చేయండి
5. కాప్చా పూర్తి చేసి “Search” క్లిక్ చేయండి
6. అక్కడ మీకు కనిపిస్తుంది:
* Insurance Company Name
* Insurance Validity (Expiry Date)
మొబైల్ యాప్ ద్వారా:-
1. “mParivahan App” ఓపెన్ చేయండి
2. Vehicle Search → వాహనం నంబర్ ఎంటర్ చేయండి
3. “Insurance Details” సెక్షన్‌లో స్టేటస్ కనిపిస్తుంది
2. ఫైన్ (Challan) స్టేటస్ చెక్ చేయడం:-
ఫైన్ స్టేటస్ చెక్ చేయటం అనేది “వెబ్సైట్ ద్వారా” ఎట్లాగో ఏంటో క్లియర్ గా చూద్దాం రండి కింద.
వెబ్‌సైట్ ద్వారా:-
1. “echallan.parivahan.gov.in“ ఓపెన్ చేయండి
2. “Check Challan Status” క్లిక్ చేయండి
3. ఈ మూడు ఆప్షన్లలో ఒకటి ఎంచుకోండి:
* Vehicle Number
* Challan Number
* DL Number
4. వివరాలు ఎంటర్ చేసి “Get Details” క్లిక్ చేయండి
5. పెండింగ్ ఫైన్లు ఉంటే:
* ఫైన్ మొత్తం
* కారణం
* తేదీ కనిపిస్తాయి
అవసరమైతే అక్కడినుంచే “ఆన్‌లైన్ పేమెంట్” కూడా చేయవచ్చు.
3. RC (Registration Certificate) స్టేటస్ చెక్ చేయడం:
RC స్టేటస్ చెక్ చేయటం అనేది రెండు విధాలుగా చేయొచ్చండి, ఎలా అంటే “వెబ్సైట్ ద్వారా” మరియు “మొబైల్ యాప్” ద్వారా ఎట్లాగో ఏంటో క్లియర్ గా చూద్దాం రండి కింద.
వెబ్‌సైట్ ద్వారా
యాప్ ద్వారా
వెబ్‌సైట్ ద్వారా:-
1. “parivahan.gov.in” వెబ్‌సైట్‌కి వెళ్లండి
2. Online Services → Vehicle Related Services ఎంచుకోండి
3. మీ రాష్ట్రం సెలెక్ట్ చేయండి
4. వాహనం నంబర్ & మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి
5. OTP వెరిఫై చేసిన తర్వాత:
* RC Active / Inactive
* Registration Validity
* Hypothecation (Loan) వివరాలు చూడవచ్చు
యాప్ ద్వారా:-
* mParivahan App → RC Details
* Digital RC కూడా యాప్‌లో సేవ్ చేసుకోవచ్చు
ముఖ్యమైన గమనికలు:-
* RC, Insurance లేకుండా వాహనం నడపడం చట్టవిరుద్ధం
* ఫైన్ పెండింగ్ ఉంటే ట్రాఫిక్ చెక్‌లో సమస్యలు రావచ్చు
* Digital RC (mParivahan / DigiLocker) చెల్లుబాటు అవుతుంది.
ఫైన్(e-Challan) ఎలా పేమెంట్ చేయాలి ?
Leave a Reply